Home Page SliderNational

55 పరుగులకు దక్షిణాఫ్రికా ఆలౌట్, సత్తా చాటిన సిరాజ్

Share with

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా సత్తా చాటింది. ముఖేష్ కుమార్ మొదటి వికెట్‌ను తీయగా, మహ్మద్ సిరాజ్ 6 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికా టెస్టుల్లో అత్యల్ప స్కోర్‌ను నమోదు చేసింది. హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ 6 వికెట్లు తీసి సత్తా చాటాడు. దక్షిణాఫ్రికాపై భారత్ క్రూరమైన ఆధిపత్యం చెలాయించింది. బుధవారం భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా స్టాండ్-ఇన్ కెప్టెన్ డీన్ ఎల్గర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా.. భారత్ బౌలర్లు చుక్కలు చూపించారు. టీం ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో రవీంద్ర జడేజాను చేర్చుకున్నారు. ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌ను బెంచ్‌కు పరిమితం చేశారు. శార్దూల్ ఠాకూర్ స్థానంలో ముఖేష్ కుమార్‌ జట్టులో చోటు సంపాదించుకున్నారు. న్యూలాండ్స్, కేప్‌టౌన్‌లో బుధవారం జరిగిన రెండో టెస్టు తొలి రోజు తొలి సెషన్‌లో భారత ఆటగాడు మహ్మద్ సిరాజ్ ఆరు వికెట్లతో దక్షిణాఫ్రికా టాప్-ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. సిరాజ్ టెస్టు క్రికెట్‌లో తన అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో ఆతిథ్య జట్టును వారి అత్యల్ప స్కోరు 55కి కట్టడి చేసింది. అంతకుముందు, రీ-ఎంట్రీ తర్వాత టెస్టుల్లో దక్షిణాఫ్రికా అత్యల్ప స్కోరు 73, ఇది 2018లో గాలేలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్. భారత్‌పై వారి అత్యల్ప టెస్ట్ స్కోరు 79.