Home Page SliderNational

బెంగళూరులో విపక్షాల భేటీకి సోనియాగాంధీ

Share with

బెంగళూరులో ఈ నెల 17, 18 వ తేదీలలో జరుగనున్న విపక్షాల భేటీకి సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, మాజీ పార్టీ ప్రెసిడెంట్ సోనియాగాంధీ  హాజరయ్యే అవకాశముందని కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్ వెల్లడించారు. జూలై 12న రాహుల్ గాంధీ ఎంపీగా అనర్హత వేటుకు నిరసనగా ఫ్రీడమ్ పార్కు వద్ద మౌన పోరాటం చేస్తామని పేర్కొన్నారు. అన్ని ప్రతిపక్షాలతో కలిపి, బీజేపీకి వ్యతిరేకంగా జూలై 17, 18 వ తేదీలలో జరుపబోయే మీటింగ్‌కు కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే విన్నపాన్ని మన్నించి, సోనియా వచ్చే అవకాశాలున్నాయని శివకుమార్ తెలియజేశారు. అన్ని పార్టీలకు తాము ఆహ్వానం పలుకుతున్నామని, ఈ ఉద్యమంలో దేశాన్ని మార్చడానికి తమతో సహకరించాలని ఆయన కోరుతున్నారు.2024లో జరగబోయే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీహార్ లోని పాట్నాలో జూన్‌లో ఏర్పాటు చేసిన మీటింగ్ కూడా జయప్రదమయ్యిందన్నారు.

అలాగే గుజరాత్ కోర్టు తీర్పు గురించి మాట్లాడలేనని, కానీ రాహుల్ గాంధీని రాజకీయంగా అణగదొక్కాలనే ఉద్దేశంతోనే ఇలాంటి కేసులు పెడుతున్నారని అందుకే తాము మౌన పోరాటం చేస్తున్నామన్నారు. ఈ పోరాటం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకూ ఫ్రీడమ్ పార్కులో జరుగుతుందన్నారు. అందరూ నోటికి అడ్డంగా నల్లని వస్త్రాన్ని కట్టుకుని రావాలన్నారు. సీఎం సిద్దరామయ్యతో సహా కాంగ్రెస్‌కు చెందిన ప్రముఖుల నుండి చిన్న కార్యకర్త వరకూ అందరూ   ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలియజేశారు. ఈ ఉద్యమం సుప్రీం కోర్టు వరకూ చేరి, రాహుల్‌పై అనర్హత వేటును తొలగించాలని పార్టీ భావిస్తోందన్నారు.