Home Page SliderNational

చిన్న సినిమాలు.. భారీ వసూళ్లు

Share with

టాలీవుడ్‌లో ప్రస్తుతం చిన్న సినిమాల హవా నడుస్తోంది. కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ చిన్న సినిమాలు చెప్పకనే చెబుతున్నాయి. దీనికి ఇటీవల విడుదలైన సామజవరగమన, బేబి సినిమాలే నిదర్శనమని చెప్పాలి. ఎటువంటి  అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలు  బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన సినిమా సామజవరగమన శ్రీవిష్టు హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమా ఇప్పటికే 50 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు మేకర్స్ తెలిపారు. అంతేకాకుండా ఈ నెల 14న విడుదలైన బేబి సినిమా కూడా విడుదలైన కేవలం వారం రోజుల్లోనే 49.2 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. వైష్ణవి చైతన్య,ఆనంద్ దేవరకొండ,విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నేటి యువతకు బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో ఈ సినిమా ఇప్పటికీ థియేటర్లలలో హౌస్‌పుల్ బోర్డులతో విజయవంతంగా కొనసాగుతోంది. కాగా ఈ సినిమా రూ.50 కోట్ల గ్రాస్‌ను నేడు క్రాస్ చేస్తుందని మేకర్స్ వెల్లడించారు. అయితే బేబి సినిమా రూ.7 కోట్లతో తెరకెక్కి వారం వ్యవధిలోనే రూ.49.2 కోట్లు రాబట్టి నిర్మాతలకు లాభాల పంట పండిస్తుంది.