Home Page SliderTelangana

బీఆర్‌ఎస్ నుండి కాంగ్రెస్‌లోకి ఆరుగురు ఎమ్మెల్సీల జంప్

Share with

మీడియా కంట పడకుండా వెనుకదారిలో మరో ఆరుగురు ఎమ్మెల్సీలు బీఆర్‌ఎస్ నుండి కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యారు. దీనితో తెలంగాణ రాజకీయాలలో మరో సునామీ చెలరేగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ నుండి రాగానే కాంగ్రెస్‌లోకి చేరారు. దీపాదాస్ మున్షీ సమక్షంలో వారు కాంగ్రెస్ గూటికి చేరారు. దీనితో శాసన మండలిలో కాంగ్రెస్ బలం 12కి చేరింది. బస్వరాజు సారయ్య, దండే విఠల్, ప్రభాకర్ రావు, ఎగ్గే మల్లేష్, భానుప్రసాద్, దయానంద్ ఈ ఆరుగురు ఎమ్మెల్సీలు రేవంత్ రెడ్డి ఇంటికి వెనుకదారి గుండా వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.  బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఎన్ని భరోసాలు ఇస్తున్నా వలసలు ఆగడం లేదు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్ నుండి కాంగ్రెస్‌లోకి చేరగా, గురువారం రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కూడా రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసి మరీ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. దీనితో తెలంగాణలో ఇక బీఆర్‌ఎస్ పని అయిపోయినట్లేనని ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకూ కాంగ్రెస్‌కు శాసనమండలిలో నలుగురు ఎమ్మెల్సీలే ఉండగా, 8 మంది బీఆర్‌ఎస్ నుండి వచ్చిన వారే చేరారు.