Home Page SliderNationalNews Alert

సిసోడియా కస్టడీ కంటిన్యూ.. తీహార్‌ జైలుకు పిళ్లై

Share with

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఆప్‌ నేత మనీష్‌ సిసోడియా కస్టడీని మరోసారి పొడిగించారు. మరో 14 రోజుల పాటు సిసోడియా కస్టడీ పొడిగించారు. మార్చి 20వ తేదీతో సిసోడియా కస్టడీ ముగిసింది. ఈ నేపథ్యంలో కస్టడీని పొడిగించి సిసోడియాను న్యాయమూర్తి ముందు ఈడీ అధికారులు హాజరుపరిచారు. లిక్కర్‌ స్కాంలో మరో నిందితుడు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బినామీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అరుణ్‌ రామచంద్ర పిళ్లై కస్టడీ కూడా మార్చి 20 తేదీతో ముగిసింది. దీంతో ఈడీ అధికారులు పిళ్లైని కూడా రౌస్‌ ఎవెన్యూ న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. పిళ్లైకి 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది సీబీఐ న్యాయస్థానం. ఏప్రిల్‌ 3వ తేదీ వరకు రిమాండ్‌ విధించింది. పిళ్లైకి జైలులో థైరాయిడ్‌ మెడిసిన్‌, ఐ డ్రాప్స్‌, ఇతర దుస్తులు అందించాలని కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత ఈడీ అధికారులు పిళ్లైను తీహార్‌ జైలుకు తరలించారు. మరోవైపు.. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ 6 గంటలకు పైనే దాటింది. పిళ్లైను, కవితను ఎదురెదురుగా కూర్చోబెట్టి ఈడీ అధికారులు ప్రశ్నించారు.