Home Page SliderTelangana

సింగరేణి వేలకోట్ల అప్పుల్లో కూరుకుపోయింది: కిషన్ రెడ్డి

Share with

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మరోసారి తెలంగాణా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం వల్లే సింగరేణి పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయిందని ఆయన కేసీఆర్‌పై మండిపడ్డారు. సింగరేణికి మొత్తం వడ్డీతో సహా రూ.25 వేలకోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచే రావాల్సివుందన్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్లు తమ స్వప్రయోజనాల కోసం వాడుకుందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. సొంత రాష్ట్రంలో సింగరేణి పరిస్థితే ఇలా ఉంటే..మరి పొరుగు రాష్ట్రంలో ఉన్న  విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఎలా కొంటారని ఆయన ప్రశ్నించారు.  ఇది కేవలం కేసీఆర్ చేసే పొలిటికల్ స్టంట్ మాత్రమేనన్నారు. సింగరేణి అప్పులపై  తెలంగాణా ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.