Home Page SliderNational

భారీగా తగ్గిన వెండి ధరలు

Share with

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా గతకొన్ని నెలలుగా దేశంలో బంగారం,వెండి ధరలు ఆకాశాన్నంటాయి. అయితే ఈ రోజు వెండి ధరలు బాగా తగ్గాయి. కాగా  నిన్నటి వరకు మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.80,300 రూపాయలుగా ఉంది. అయితే ఇవాళ మార్కెట్‌లో వెండి ధర రూ.1800 తగ్గింది. దీంతో ప్రస్తుతం మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.78,500కి చేరింది. మరోవైపు బంగారం ధరలు కూడా చాలా స్వల్పంగా తగ్గాయి. కాగా ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గి రూ.54,950గా ఉంది.  అంతేకాకండా 24 క్యారెట్ల 10 గ్రాము బంగారం ధర రూ.160 తగ్గి రూ.59,950 వద్ద కొనసాగుతోంది. అయితే తగ్గిన ఈ ధరలే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్నాయి.