Home Page SliderTelangana

సిద్దిపేట: రేపు తుఫ్రాన్‌లో నరేంద్ర మోడీ గారి మీటింగ్ ఉంది తప్పకుండా రమ్మని పిలిచిన ఈటల

Share with

గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం ములుగు మండలం అర్ అండ్ ఆర్ కాలనీ  బైలంపుర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఈటల రాజేందర్.

బానిసత్వంలో మగ్గుదామా?  బయటపడదామా? ఈటల రాజేందర్ అనేవాడు భయపడేవాడు కాదు. నన్ను భయపెట్టేవాడు పుట్టలేదు.

మల్లన్నసాగర్‌లో భూనిర్వాసితులకు కేసీఆర్ అన్యాయం చేశారు. ఇక్కడో రైతుకి 40 ఎకరాల భూమి పోయింది. ఆయనకు ఇప్పుడు కనీసం ఉపాధి లేదు. అడ్డామీద కూలీగా మారాల్సి వచ్చింది. ఊరు పట్టు ఉడుం పట్టు అంటారు. ఈ బైలంపూర్ ఆ ఊరు పట్టును కోల్పోయి ఇక్కడ అనాధాలుగా బతుకుతున్నారు.

ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు కానీ, వారికి నష్టపరిహారం చెల్లించడంలో తీవ్ర అన్యాయం జరిగింది. ఎకరానికి ఆరు లక్షలు ఇచ్చి గుంజుకుంటే.. ఆ డబ్బులు పెట్టి భూములు కొనుక్కుందామంటే ఎకరానికి 10 గుంటలు కూడా రాలేదు. భూములు కోల్పోయి, గ్రామ ఆనవాళ్లు కోల్పోయిన వారికి ఎన్ని లక్షల రూపాయలు ఇచ్చినా ఆ గాయం మానదు. 18 సంవత్సరాలు నిండిన వారికి ప్యాకేజీ ఇవ్వటం లేదు. వారికి సొంత ఇల్లు ఇంటి జాగా ఇవ్వాలి. బైలంపురం గ్రామానికి చెందిన వారివి 1000 ఎకరాల భూమి తీసుకున్నారు. ఆ భూములన్నీ పేదలవి. ఈ ఊరు చుట్టూ ఉన్న భూములన్నీ కాంట్రాక్టర్లకు అమ్ముకున్నారు. పేదవారి నుంచి గుంజుకున్నా భూములు పేదలకు అన్నం పెట్టలేదు. ఒక్కో ఊరికి కొంతమంది బ్రోకర్లు ఉంటారు. వానికి ఒక్కనికి కడుపు నిండితే మన కడుపు నిండినట్టా. గ్రామపంచాయతీ బిల్డింగ్ కడితే, రోడ్లు వేస్తే బాధలు తీరినట్ట. కెసిఆర్ కట్టించిన ఇల్లు కురుస్తుంటే మళ్ళీ ఖర్చు పెట్టీ కట్టుకున్నారు. కెసిఆర్ తాత జాకీరు అనుకుంటున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఓటు వేసి గెలిపించిన ఖర్మానికి 30 వేల కుటుంబాలు బాధపడుతున్నాయి. బానిసత్వంలో మగ్గుదామా?  బయటపడదామా?  ఆలోచన చేయండి కేసీఆర్ ఫామ్ హౌస్ దరిదాపుల్లోకి కూడా ఎవరినీ పోనియ్యరు.

ఆర్ అండ్ ఆర్ కాలనీలో మీరు పడే బాధకు విముక్తి కలిగిస్తాము. మన జీవితాల మీద, మన పిల్లల ఉద్యోగాల మీద కేసీఆర్‌కి పట్టింపు లేదు. ఆయనకి ఉన్నదల్లా అసైన్డ్ భూములను లాక్కొని పేదలను రోడ్డు మీద పడవేయడమే. నన్ను  నిండు మనసుతో ఆశీర్వదించండి. మీ కాలికి ముల్లు గుచ్చుకుంటే పంటితో తీసేలాగా సేవ చేస్తాను. ఈటల రాజేందర్ అనేవాడు భయపడేవాడు కాదు. రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి కేసీఆర్ వరకు అందరితో పోట్లాడుతున్నాను. అన్యాయం ఎక్కడ జరుగుతుందో అక్కడ కొట్లాడే బిడ్డను.

నన్ను భయపెట్టేవాడు పుట్టలేదు. నీ దగ్గరికి వస్తా నీతో తేల్చుకుంటాను అని వచ్చాను. అది తేల్చుకునే బాధ్యత ప్రజల చేతిలో ఉంది కాబట్టి నన్ను కాపాడండి అని విజ్ఞప్తి చేస్తున్నాను.