Home Page SliderNational

భారతీయుడు-2 మూవీలో సిద్ధార్థ్

Share with

శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా తెరకెక్కిన చిత్రం భారతీయుడు. ఈ సినిమా 9 మే 1996లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే భారతీయుడు సినిమా సినీ ఇండస్ట్రీలోనే ఓ అద్భుతం అని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా అప్పట్లో సృష్టించిన ప్రభంజనం అంత ఇంత కాదనే చెప్పాలి. ఈ సినిమాతో కమల్ హాసన్ పేరు ప్రపంచ వ్యాప్తంగాను,దేశవ్యాప్తంగాను మార్మోగిపోయింది. అంతేకాకుండా ఈ సినిమా ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను దక్కించుకుంది. ఈ నేపథ్యంలో భారతీయుడు విడుదలైన 27ఏళ్ల తర్వాత భారతీయుడు-2 పట్టాలెక్కింది. అయితే శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో కమల్‌హాసన్‌కు జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. కాగా ఈ సినిమా నుండి తాజాగా మరో అప్‌డేట్ వచ్చింది. అదేంటంటే హీరో సిద్ధార్థ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ రోజు సిద్ధార్థ్ పుట్టినరోజు  సందర్భంగా ఈ సినిమా నుంచి సిద్ధార్థ్ పోస్టర్‌ను విడుదల చేసిన చిత్రబృందం ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది. అయితే ఈ సినిమా భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే.