Home Page SliderNational

‘సజీవంగా, ఆరోగ్యంగా ఉన్న పిండాన్ని చంపేయమని కోరాలా’?… సుప్రీం సూటి ప్రశ్న

Share with

తల్లికి గల హక్కులతో పాటు గర్భస్థ శిశువుకు కూడా హక్కులు ఉంటాయని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. ఆరోగ్యంగా, సజీవంగా ఉన్న 26 వారాల గర్భస్థ శిశువును చంపడానికి అంగీకరించేది లేదని వ్యాఖ్యానించింది. ఏసమస్యలు లేకుండా జీవించే అవకాశం గల పిండాల్ని తాము చంపలేమని ఒక మహిళ కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది.

ఇప్పటికే  ఇద్దరు పిల్లలు ఉన్న 27 ఏళ్ల వివాహిత మహిళ తనకు గల ఆర్థిక,మానసిక ఇబ్బందుల వల్ల 26 వారాల గర్భాన్ని తొలగించేటందుకు అనుమతినివ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మొదటగా విచారించిన ద్విసభ్య ధర్మాశనం ఆమెకు అక్టోబరు 9న అనుమతి ఇచ్చింది. అయితే కేంద్రం అంగీకరించక మరలా పిటిషన్ దాఖలు చేసింది. పిండం బతికే అవకాశాలు ఉన్నాయన్న ఎయిమ్స్ వైద్యుల నివేదికతో ఈ అనుమతిని తోసిపుచ్చింది. కోర్టు ఉత్తర్వుల ద్వారా బిడ్డను చంపేందుకు అనుమతి కోరుతున్నారా అంటూ చంద్రచూడ్ ప్రశ్నించారు. ఇది ధర్మానికీ, చట్టానికీ కూడా విరుద్ధమని వ్యాఖ్యానించారు.