Home Page SliderTelangana

ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ లో షార్ట్ సర్క్యూట్- రెండుబోగీలు పూర్తిగా దగ్ధం

Share with

ఫలక్‌నుమా రైలులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్య నడుస్తున్న సమయంలో ఈ రైలులో షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ ప్రమాదంలో రెండు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మొదటిగా పొగను గమనించిన కొందరు ప్రయాణికులు ఒకరి కొకరు సమాచారం ఇచ్చుకుంటూ చైన్‌ను లాగి రైలును ఆపివేశారు. ఎస్ 4, ఎస్ 5 బోగీలలో బాగా మంటలు వ్యాపించాయి. బోగీలను విడగొట్ట లేకపోవడంతో మరొక బోగీకి కూడా మంటలు అంటుకున్నాయి. ప్రమాదాన్ని పసిగట్టిన రైల్వే అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. రైలును అక్కడే నిలిపివేశారు. ఆ రెండుబోగీలలోని  ప్రయాణికులు హుటాహుటిన కిందకు దిగడంతో పెద్దప్రమాదం తప్పింది. అనంతరం ఆ రెండుబోగీలు పూర్తిగా కాలిపోయాయి. దీనితో రైలును పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్యలో నిలిపివేశారు. రైల్వే అధికారులకు సమాచారం అందింది. రెండు ట్రాక్‌లపై ఈ మార్గంలో వచ్చే ఇతర రైళ్లను ఆపివేశారు. దగ్గరలోని స్థానికులు మంటలను ఆర్పివేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఫైరింజన్లు రావడానికి సమయం పట్టవచ్చని సమాచారం.