Andhra PradeshNewsNews AlertTelangana

హీరోయిన్‌గా ఏంట్రీ ఇవ్వనున్న శేఖర్ మాస్టర్ కూతురు

Share with

ఇండస్ట్రీలో శేఖర్ మాస్టర్ అంటే తెలియని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. సదాసీదాగా ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఉన్న కొరియోగ్రాఫర్స్‌లో శేఖర్ మాస్టర్ చాలా బిజీ నృత్య దర్శకునిగా కొనసాగుతున్నారు. . ప్రస్తుతం టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్లలలో శేఖర్ మాస్టర్ ఒకరు. ఒకవైపు సినిమా కొరియోగ్రఫీతో పాటు బుల్లి తెర షోలకు కూడా జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈయన కుమార్తె సాహితీ ఇప్పుడు హీరోయిన్‌గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సాహితీ , తండ్రికి ఏ మాత్రం తీసిపోని విధంగా నృత్యం చేస్తూ అందరినీ ఆకర్షిస్తోంది. తన తండ్రితో కలిసి కొన్ని టీవీ షోలలో కూడా డాన్స్ పర్ఫార్మెన్స్‌లు ఇచ్చింది. తన తొలి సినిమాకు సంబంధించిన విషయంలో ఇప్పటికే ఆమె కథను విన్నట్టు..దానికి శేఖర్ మాస్టర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. సాహితీ సరసన నటించే హీరో కోసం శేఖర్ మాస్టర్ ప్రయత్నాలు చేస్తున్నట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.