Home Page SliderTelangana

కాజల్ ఇంకా ‘మిత్రవింద’లాగే ఉందన్న శేఖర్ కమ్ముల

Share with

నేడు అందాల తార కాజల్ బర్తడే సందర్భంగా ఆమె కొత్త సినిమా సత్యభామ టీజర్ రిలీజ్ చేశారు చిత్రబృందం. ఈ చిత్రంలో ఆమె పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు. దీనితో కాజల్ చాలా ఆనందంగా ఫీలయ్యింది. ఈ సందర్భంగా ఆమె హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తనకు పుట్టింటికి వచ్చినట్లుందని, తెలుగు ఆడియన్స్ చాలా మంచివారని కితాబు ఇచ్చేసింది. ఈ కార్యక్రమంలో డైరక్టర్ శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ఆమెకు పెళ్లి అయినా, బిడ్డకు తల్లి అయినా కూడా ఇంకా మగధీర చిత్రం నాటి మిత్రవిందలాగే ఉందని పొగడ్తలతో ముంచెత్తారు.  

ఆమె తల్లి అయ్యే క్రమంలో కొన్నాళ్లు చిత్రపరిశ్రమకు దూరమయ్యారు కాజల్. కొడుకు పుట్టిన తర్వాత చేస్తున్న చిత్రం కావడంతో అది కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం కావడంతో ప్రేక్షకుల అంచనాలు బాగా ఉన్నాయి. ఈ చిత్రమే కాకుండా బాలకృష్ణ హీరోగా వస్తున్న భగవంత్ కేసరి చిత్రంలో కూడా నటించనుంది. దీని పోస్టర్‌లో సైకాలజీ, మెథడాలజీ పుస్తకం పట్టుకుని ఉన్న ఆమె ఫొటోను విడుదల చేశారు భగవంత్ కేసరి టీమ్.