Home Page SliderInternational

ఖతార్‌లో ఉరిశిక్ష పడ్డ భారతీయ ఖైదీలకు శిక్ష రద్దు..

Share with

ఖతార్ దేశంలో 8మంది భారతీయ ఖైదీలకు ఊరట లభించింది. వారికి పడిన ఉరిశిక్షను రద్దు చేస్తూ, దానిని జైలుశిక్షగా తగ్గిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. గూఢచర్యం ఆరోపణలో భారత నౌకాదళ మాజీ అధికారులకు ఉరిశిక్ష పడింది. భారత్ విదేశాంగ యాత్ర ఖతర్ అధికారులతో చర్చిస్తున్నామని, భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ కేసులో తదుపరి చర్యలు చేపట్టేందుకు న్యాయబృందంతో కూడా సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొన్నారు. ఖతర్ సాయుధ దళాలకు శిక్షణ అందించే అల్ దహ్రా సంస్థలో ఈ ఎనిమిది మంది పనిచేస్తున్నారు. ఈ సంస్థను ఒమన్‌కు చెందిన ఓమాజీ వైమానిక దళ అధికారి నిర్వహిస్తున్నారు. వీరిని ఖతర్ 2022 ఆగస్టులో నిర్భంధంలోకి తీసుకున్నారు. సబ్‌మెరైన్ కార్యక్రమాల్లో గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలతో వీరిని నిర్భంధించారు. దీనితో వీరికి మరణశిక్ష విధిస్తూ అక్టోబరులో అక్కడి న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై భారత విదేశాంగ శాఖ దోహాలో అప్పీలు చేసింది. దీనితో వారికి మరణశిక్ష రద్దయి, జైలుశిక్ష విధించారు. కానీ ఎన్నాళ్లు ఈ శిక్ష అనే దానిపై పూర్తి వివరాలు తెలియలేదు.