Home Page SliderTelangana

తెలంగాణా హైకోర్టు సంచలన తీర్పు

Share with

తెలంగాణాలోని ఆదివాసీలకు అనుకూలంగా హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. కాగా ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాలు ఐదో షెడ్యూల్ పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది. అయితే తాము ఐటీడీఏ పరిధిలో లేనందున ఉద్యోగ అవకాశాలు కోల్పోయామని ఆదీవాసీలు పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆదీవాసీల తరుపు న్యాయవాది ఆదీవాసీలు 1/70 చట్టం అమలుకాక నష్టపోతున్నారని కోర్టులో వాదించారు. అయితే దీనిపై ఆదీవాసీలు 75 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారని ఆయన కోర్టుకు తెలియజేశారు. కాగా వాదనలు విన్న హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్  ములుగు జిల్లా మంగపేటలోని ఆయా గ్రామాలు ఐదో షెడ్యూల్ పరిధిలోకి వస్తాయని తీర్పు  వెలువరించింది. ఈ తీర్పుతో ఆదీవాసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.