Home Page SliderTelangana

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీతక్క మాట

Share with

తెలంగాణ  ప్రభుత్వం వాగ్దానం చేసినట్లుగా ఉచిత బస్సు ప్రయాణం మొదలయ్యింది. మహిళా,శిశు సంక్షేమ మంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేసిన సీతక్క తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు. ఆమె ఈరోజు ఈ ఉచిత బస్సును ప్రారంభించారు. సోనియా గాంధీ తన మాటను నిలబెట్టుకున్నారని ఆనందం వ్యక్తం చేశారు. మహిళలు తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలన్నా, పిల్లల వద్దకు వెళ్లాలన్నా ఇది చాలా ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. ఇది మహిళలకు ఆర్థిక స్వావలంబన కలుగజేస్తుందన్నారు.  తాను ఏ పదవి వచ్చినా టెన్షన్ పడతానని, ఇప్పుడు ఇంత బాధ్యతాయుతమైన మంత్రి పదవిలోకి వచ్చినందుకు చాలా కంగారుగా ఉందని పేర్కొన్నారు. ప్రజల అంచనాకు తగినట్లుగా తాను పని చేయడానికి ప్రయత్నిస్తున్నానని పేర్కొన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయకుండా ఆందోళన చేయడం తప్పన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజాస్వామ్యం ఉంటుందన్నారు. మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.