Home Page SliderTelangana

ములుగులో సీతక్క ఘన విజయం

Share with

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతూనే ఉంది. కాగా ఇప్పటికే తెలంగాణాలో అత్యధిక స్థానాల్లో  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క ములుగులో మరోసారి విజయ ఢంకా మోగించారు. బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతిపై 33,700 ఓట్ల మెజార్టీతో సీతక్క గెలుపొందారు.