Home Page SliderNational

కోటి విలువ చేసే ప్రీతమ్ ఎద్దును రక్షించిన భద్రతాదళాలు

Share with

ఢిల్లీ, నోయిడాలను కుదిపేస్తున్నాయి యమునానది వరదలు. ఈ వరద నీటిలో చిక్కుకుని అనేక మూగజీవాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. ఇలాంటి ఒక ప్రత్యేక గిర్ జాతికి చెందిన ప్రీతం అనే ఎద్దును కాపాడింది భారత ఎన్డీఆర్‌ఎఫ్ బృందం. నోయిడా తీరం వెంబడి ఉన్న 8 గ్రామాల మనుష్యులతో పాటు అనేక జంతువులను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు. వీటిలో ఆవులు, ఎద్దులు, కుక్కలు, కుందేళ్లు వంటి ఎన్నో జంతువులు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకూ 6 వేలకు పై చిలుకు జంతువులను కాపాడినట్లు ప్రకటించారు. ఈ ప్రీతం ఎద్దు దేశంలోనే అతి ఖరీదైన ఎద్దుగా ఖ్యాతి గడించింది. దీని విలువ కోటి రూపాయల పైనే ఉంటుందని అంచనా. ఈ ప్రీతం అనే ఎద్దు వీర్యానికి కూడా మంచి గిరాకీ ఉందట. భారత్‌లోని బీఎండబ్ల్యూ కారు కన్నా దీని ధర ఎక్కువని నెటిజన్లు నవ్వుతున్నారు. 8వ బెటాలియన్‌కు చెందిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందం స్వయంగా ఈ ఎద్దును రక్షించిన విషయాన్ని ట్విటర్‌లో ప్రకటించారు. దీని వయస్సు 7 సంవత్సరాలు.