Home Page SliderTelangana

 SCT SI పరీక్ష హాల్‌టికెట్లు విడుదల

Share with

 నేడు తెలంగాణాలో SCT SI టెక్నికల్ పరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు www.tslprb .in  వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే ఈ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఈ నెల 24వ తేది అర్థరాత్రి 12 గంటల వరకు అవకాశముంటుంది. కాగా ఈ నెల 26 తేది ఈ పరీక్ష జరగనుంది. అయితే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఈ పరీక్షకు హజరయ్యే అభ్యర్థులు తమ హాల్‌టికెట్లపై పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను తప్పనిసరిగా అతికించాలని అధికారులు తెలిపారు. అలా చేయని పక్షంలో వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష హాల్‌లోకి అనుమతించబోమని అధికారులు హెచ్చరించారు. ఇది ఇలా ఉంటే మరోపక్క ఈ పరీక్షలను కూడా రద్దు చేయాలని కొందరు అభ్యర్థులు డిమాండ్ చేయడం గమనార్హం.