Andhra PradeshHome Page Slider

జగన్ వస్తేనే పథకాలు.. చంద్రబాబు వస్తే పథకాల రద్దుకు ఆమోదం తెలిపినట్టే: జగన్

Share with

సిద్ధం సభ సాక్షిగా జగన్ ఓటర్లుకు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబును నమ్మితే ఏం జరిగిందో గతంలో చూశాం.. ఇంకా అవసరమా అంటూ ఒక్క ముక్కలో చెప్పేశారు. త్వరోలనే మేనిఫెస్టో విడుదల చేస్తానన్నారు జగన్. చేయగలిగిందే చెప్తానన్నారు. అందులో చెప్పిన ప్రతి ఒక్కటి చేస్తానన్నారు. జగన్ మాట ఇచ్చాడంటే… తగ్గేదేలేదని స్పష్టం చేశారు. ఇక జగన్ తాను పథకాలకు ఇస్తున్న హామీల వివరాలు చెప్పారు.

తాను పేదలకు ఇస్తున్న పథకాల వివరాలు చెప్పారు జగన్

పింఛన్ల కోసం చేస్తున్న ఖర్చు 66 లక్షల మందికి పింఛన్లకు ఇవ్వాల్సిన మొత్తం ఏటా 24 వేల కోట్లు
ఉచిత విద్యుత్, రైతులకు ఇచ్చే విద్యుత్ కోసం 11 వేల కోట్లు
సబ్సిడీ కింద బియ్యం ఇచ్చేందుకు ఖర్చు చేస్తోంది 4600 కోట్లు
ఆరోగ్య శ్రీ, 104, 104 ఆరోగ్య ఆసరా కోసం ఖర్చు చేస్తోంది రూ. 4,400 కోట్లు
పూర్తి ఫీజ్ రీయింబర్స్మెంట్ కోసం విద్యాదీవన, వసత దీవెన 5 వేల కోట్లు
సంపూర్ణ పోషణ కింద రూ. 2,200 కోట్లు
గోరు ముద్ద కింద 1,900 కోట్లు
8 పథకాలకు ఇవ్వాల్సిన మొత్తం రూ. 52,700 కోట్ల రూపాయలు.. ఈ మొత్తం నిధులను ఎవరొచ్చినా కచ్చితంగా అమలు చేయాల్సిన పథకాలని చెప్పారు జగన్…

ఇక చంద్రబాబు ప్రజలను మోసం చేయడానికి పథకాలు చెప్తున్నారని విమర్శించారు.
సూపర్ 6 వాగ్దానాలకు అయ్యే ఖర్చు పచ్చి మోసమే.. ఎవరూ కూడా అమలు చేయలేరని తెలుసన్నారు.
ఆరు పథకాల కు 73,440 కోట్ల రూపాయలు
చంద్రబాబు ఈ మధ్యనే ఏడో హామీ బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ తాను చెప్పిన హామీ రూ. 13,872 కోట్లు
చంద్రబాబు చెప్పిన 6 సిక్సులు, ఏడో పథకానికి రెండు కలిపితే 87,312 కోట్లు
ఇంతక ముందు చెప్పిన 8 స్కీములకు ఎవరైనా టచ్ చేయలేని స్కీములు రూ 52,700 కోట్లు
అక్షరాల చేయాల్సిన లక్షా 40 వేల కోట్ల గురించి చెబుతున్నాడు చంద్రబాబు
ప్రజల చేతికిస్తే గతంలో ఇవ్వని విధంగా చేస్తే ఎప్పుడూ జరగని విధంగా వివక్ష లేకుండా ఇవ్వగలిగితే రూ. 75 వేల కోట్లు… ఇవాళ చంద్రబాబు చెప్తున్న హామీలు ఇప్పటికే లక్షా 40 వేల కోట్లు దాటుతూ ఉన్నాయ్…
చంద్రబాబు హామీలు ప్రజలు ఎంతగా మోసం చేసేందుకు చెప్తున్నాడో ఆలోచించండి… ఈ డబ్బు ఎక్కడ్నుంచి తెస్తాడు.. ఇదే అంశాలపై అసెంబ్లీలో వివరించానన్నారు జగన్. పేద ప్రజలు మరోసారి నమ్ముతారేమోనని అబద్ధాలు చెబుతున్నాడు. అబద్ధాలకు హద్దులెందుకని అబద్ధం చెప్పే సిద్ధాంతం నమ్ముకున్నాడు. బాబు మేనిఫెస్టో నమ్మడమంటే బంగారు కడియం ఇస్తాననే కథలో పులిని నమ్మినట్టుగానే ఉంటుంది. 58 నెలల్లో 130 సార్లు బటన్ నొక్కాడు. 2,70 వేల కోట్ల రూపాయుల డీబీటీగా నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాలోకి నేరుగా పంపాడు. రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా జగన్ చేశాడు. ఇదంతా జగన్ కు మాత్రమే సాధ్యమయ్యింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమయ్యింది. ఇవన్నీ కొనసాగాలంటే ఈ ప్రయోజనాలు అందుకున్న ప్రతి కుటుంబం మనకు స్టార్ క్యాంపెయినర్ గా బయటకు వచ్చి ఓటు వేయడమే కాదు.. వంద మందికి చెప్పి ఓటు వేయించాలన్నారు జగన్…

2019లో జగన్ ఒక మాట చెప్పాడు. బిడ్డ వస్తాడు. మంచి రోజులు తెస్తాడని మాట ఇచ్చాడు. 2019లో జగన్ చెప్పాడు. ఈరోజు మళ్లీ మీ అందరికీ ఐదేళ్ల తర్వాత మీ బిడ్డ మరో మాట చెప్తున్నాడు… నేను చెప్పే ఈ మాటను ప్రతి ఊరిలోనూ చెప్పండి. ప్రతి ఇంట్లోనూ చెప్పండి. ప్రతి గడపలోనూ చెప్పండి… పేద వాడి భవిష్యత్ బాగు పడాలంటే జరుగుతున్న ఈ మంచి కొనసాగాలంటే మళ్లీ జగనన్ననే తెచ్చుకుందామని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. ప్రతి ఊళ్లోనూ వెళ్లి చెప్పండి. ప్రతి గడపలోనూ చెప్పండి. పేదోడి భవిష్యత్ బాగుపడాలంటే మళ్లీ అన్నను తెచ్చుకోవాలని చెప్పండి.. అన్నను సీఎంగా తెచ్చుకుందాం.. మన అన్న ప్రభుత్వాన్ని మళ్లి రక్షించుకుందాం.. బాబు అనే మాయలోడి వలలో పడొద్దని చెప్పండి… మరింత మంచి అన్నతో చేయించుకుందాం.. మనందరి చల్లని దీవనెలతో వెళ్లి చెప్పండన్నారు జగన్…

అరడజను పార్టీలు అరడజను బాణాలు ఎక్కుపెట్టాయి. అయినా పొత్తులను నమ్ముకోలేదు. మనల్నే నమ్ముకున్నాడు. అన్న ఒంటరిగానే సింహంలా మనందరికీ తోడుగా నిలబడ్డాడని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలన్నారు జగన్… ప్రజల్ని, దేవుడ్ని తప్ప పొత్తుల్ని, ఎత్తుల్ని నమ్ముకోలేదు. ఎప్పుడూ మోసాలు చేయలేదు. అబద్ధాలు చెప్పలేదు. జిత్తులను నమ్ముకోలేదు. ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలన్నారు. తాను చేసిన నమ్మిని మంచి జరిగిన ప్రజల్ని మాత్రమే నమ్ముకున్నారని చెప్పాలన్నారు జగన్.. జగన్ ను గెలిపించేందుకు చేయి చేయి కలపాలి మనందరం సిద్ధమని చెప్పాలన్నారు జగన్… సీఎంగా అన్న వస్తేనే నెలనెల ఒకటో తేదీని చిక్కటి చిరునవ్వులతో మన ఇంటికే 3 వేల పింఛన్ తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుందని చెప్పండి… సీఎంగా అన్న వస్తేనే ఇచ్చిన ఇంటి పట్టాల్లో ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. సీఎంగా జగన్ వస్తేనే అమ్మ ఒడి వస్తుంది. పిల్లలు స్కూళ్లకు వెళ్తారు. మళ్లీ జగన్ వస్తేనే చేయూత వస్తుంగది. మళ్లీ జగన్ వస్తేనే రైతు భరోసానే అందుతుందని చెప్పాలన్నారు. సీఎం జగన్ వస్తేనే పెద్ద చదువులు చదువుతున్నవారికి విద్యా దీవెన, వసతి దీవెన వస్తుందని చెప్పాలన్నారు జగన్. సీఎంగా జగన్ ను గెలిపించుకుంటే బటన్ నొక్కితేనే లంచాలు లేకుండా నేరుగా వస్తాయని చెప్పాలన్నారు. జగన్ వస్తే గవర్నమెంట్ బడులు, హాస్పటల్స్ బాగుపడతాయని చెప్పాలన్నారు. జగన్ వస్తేనే నవరత్నాలు కొనసాగుతాయని చెప్పాలన్నారు. బాబుకు ఓటేస్తే వాలంటర్ల రద్దుకు ఓటేసినట్టేనన్నారు జగన్.