Home Page SliderNational

బాలిలో న్యూలుక్‌లో అదరగొడుతున్న సమంత

Share with

స్టార్ హీరోయిన్ సమంత గతకొంత కాలంగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. కాగా మయోసైటిస్ ట్రీట్మెంట్ కోసం సమంత విదేశాలకు చేరుకున్నారు. అయితే ఇటీవల ఈ ట్రీట్మెంట్‌లో భాగంగా ఓ ఏడాదిపాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నట్లు సమంత ప్రకటించారు. కాగా ఆమె ఈ సమయాన్ని ప్రకృతి ఒడిలో గడిపేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే సమంత ఇండోనేషియాలోని పర్యాటక ప్రాంతం బాలిలో న్యూలుక్‌లో ఎంజాయ్ చేసిన వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో ఈ వీడియో చూసిన ఆమె ఫ్యాన్స్ షార్ట్ హెయిర్‌లో తన లుక్ బాగుందని ట్వీట్స్ చేస్తున్నారు. ఈ మేరకు ట్విటర్‌లో SAMANTHA హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.