Home Page SliderInternational

పాక్‌లో మంత్రుల జీతాల కోత- లగ్జరీల రద్దు

Share with

పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోంది. ఈ పరిస్థితిలో కఠిన నిర్ణయాలు తప్పదంటున్నారు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్. దీనిలో భాగంగా మంత్రుల వ్యయాలకు, జీతాలకు కోతలు విధిస్తున్నారు. సామాన్య ప్రజలు తిండికి కూడా లేక దీనస్థితిలో ఉంటే మంత్రులు ఫైవ్‌స్టార్ హోటళ్లలో ఉండడం, విమానాలలో బిజినెస్ క్లాసుల్లో ప్రయాణించడం మంచి పద్దతి కాదని, ప్రస్తుతం వ్యయాలు తగ్గించడం చాలా అత్యవసరమని ప్రధాని అభిప్రాయపడ్డారు. మంత్రులు ఆడంబరాలకు పోవద్దని, లగ్జరీ కార్లు,విలాసవస్తువులు వాడొద్దన్నారు. మరొక సంవత్సరం పాటు కార్ల కొనుగోలుపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. స్వచ్చందంగా జీతంలో కోతలకు ముందుకు వచ్చిన మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.