Home Page SliderTelangana

ఆన్‌-లైన్లో పడిన సాలార్‌జంగ్ మ్యూజియం

Share with

సాలార్‌జంగ్ మ్యూజియంను చూడాలనుకుంటున్నారా?  కష్టపడి అంతదూరం వెళ్లి, విశాలమైన ప్రాంగణమంతా నడుస్తూ చూడలేకపోతున్నారా?  ఎప్పడినుండో చూడాలని ఉన్నా సమయం లేక వాయిదాలు వేస్తున్నారా? ఇప్పుడు ఆ అవసరం లేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు హాయిగా ఇంట్లో నుండే చూసుకోవచ్చు. ‘గూగుల్ ఆర్ట్స్ అండ్ కల్చర్’ ప్రాజెక్టులో భాగంగా మ్యూజియంను అంతర్జాలంలో వీక్షించవచ్చు.  ఈ మ్యూజియంలోని అపురూప శిల్పాలు, అరుదైన వస్తువులు, చిత్రాలు, చరిత్రలో కలిసిపోయిన రాజుల వస్తువులు, మను స్క్రిప్ట్‌లు, హస్తకళలు, సిరామిక్స్, ఆనాటి రాజవంశీయులు దుస్తులు, ఖడ్గాలు వంటివన్నీ పేరుపేరునా, వాటి చరిత్రకు సంబంధించిన సమాచారం సమస్తం ‘గూగుల్ సింబల్స్ ఆఫ్ గ్లోరీ’ పేరుతో అంతర్జాలంలో అందుబాటులో ఉంచింది.

నిజాం రాజుల సాహస యాత్రలు, దక్కన్ ఎపిక్ ఆర్ట్స్, భారతీయ చరిత్రకు సంబంధించిన వివరాలు, ముఖ్యమైన చిత్రాలు, ఫైబర్ ఆర్ట్స్, హైదరాబాద్ చరిత్రతో ముడిపడిన చిత్రాలు చక్కగా చూసుకోవచ్చు. ‘వండర్స్ ఇన్ వుడ్’ అనే పేరుతో ఇవన్నీ డిజిటలైజ్ చేశారు. ఇంకా ‘మ్యాజిక్ ఆఫ్ బ్రాంజ్’ పేరుతో లోహపు వస్తువులు, ‘ఏ గేమ్ ఆఫ్ థ్రోన్స్’, ‘హౌ చెస్ కాంకర్డ్ ది వరల్డ్’ అనే పేర్లతో సమాచారం నిక్షిప్తమై ఉంది. ఇంకెందుకాలస్యం? http//artsandculture.google.com/partner/salar-jung-museum అనే వెబ్‌సైట్‌ను సందర్శించి చరిత్రలో విహారం చేసిరండి.