Home Page SliderNational

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న “సలార్” టీజర్

Share with

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “సలార్”. KGF లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సినిమా అందించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా టీజర్‌ను ఇవాళ ఉదయం 5:12 గంటలకు చిత్రబృందం విడుదల చేసింది. కాగా ఈ టీజర్‌కు భారీ స్పందన లభిస్తోంది. సలార్ టీజర్  తెల్లవారుజామున విడుదల చేసినప్పటికీ..కేవలం 5 నిమిషాల్లోనే లక్ష్య వ్యూస్ సాధించింది. ప్రస్తుతం టీజర్ విడుదల అయిన 5 గంటల్లోనే 2 కోట్ల వ్యూస్ సాధించి యూట్యూబ్‌ను షేక్ చేస్తుందని మేకర్స వెల్లడించారు. అయితే ప్రభాస్‌ను మరికొన్ని సెకండ్లు చూపిస్తే ఇంకా సంతోషించేవాళ్లమని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.