Home Page SliderInternational

ఆత్మాహుతి ట్యాంకర్లతో ఉక్రెయిన్‌పై రష్యా దాడులు

Share with

రష్యాకు యుద్ధకాంక్ష రోజురోజుకీ తీవ్రమవుతోంది. ఉక్రెయిన్‌పై రకరకాల వ్యూహాలతో విరుచుకుపడుతోంది. సోమవారం రాత్రి టన్నుల కొద్దీ టీఎన్‌టీ వంటి పేలుడు పదార్థాలతో నింపిన ట్రక్కును ఉక్రెయిన్ సైనికులపై వదిలి రిమోట్‌తో పేల్చేశారు. ఈమధ్యనే ఉక్రెయిన్‌లోని భారీ డ్యామ్‌ను పేల్చేసిన రష్యా అంతటితో ఆగడం లేదు. ఈ విషయాన్ని రష్యా స్వయంగా టెలిగ్రామ్ ఛానెల్‌లో వెల్లడించారు. ఆత్మాహుతి దాడులతో కూడా ఉక్రెయిన్‌ సైన్యానికి భారీ నష్టం కలుగజేస్తున్నారు. ఐదువందల కిలోల భారీ పేలుడు పదార్థాలను ఉంచిన ట్రక్కును ఉక్రెయిన్ సైనికులకు 300 మీటర్ల దూరంలో పెట్టి రష్యాసైనికులు పారిపోయారు. అనంతరం రేడియో కంట్రోల్ మిషన్ సహాయంతో దానిని పేల్చివేశారు. దీనితో భారీ విస్ఫోటనం కలిగి షాక్ వేవ్స్ సంభవించినట్లు పేర్కొంటున్నారు. ఉక్రెయిన్ టెలికమ్యూనికేషన్, వ్యవసాయ ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని రష్యా యుద్ధాన్ని కొనసాగిస్తోంది.