Andhra PradeshHome Page SliderTelangana

రూ. 2 తగ్గింపు తర్వాత హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ 107.41, విజయవాడలో 109.31

Share with

కేంద్ర ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు పెట్రోల్, డీజిల్ ధరలను రెండు రూపాయల మేర తగ్గించింది. కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తగ్గింపు విషయాన్ని ట్విట్టర్‌లో చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ ప్రకటన వచ్చింది. తగ్గించిన ధరలు మార్చి 15, ఉదయం 6 గంటల నుంచి అమలులోకి వచ్చాయి. పెట్రోలు, డీజిల్ ధరలను ₹ 2 తగ్గించడం ద్వారా దేశంలో కోట్లాది మంది భారతీయుల సంక్షేమం, సౌలభ్యమే తన లక్ష్యమని ప్రధాని మరోసారి నిరూపించుకున్నారని మంత్రి అన్నారు.

తాజాగా పెట్రోల్ ధరలు తగ్గించడం ద్వారా ఏపీలో ఆయా ప్రాంతాల్లో లీటర్ కు రెండు నుంచి రెండున్నర రూపాయల మేర భారం తగ్గింది. విజయవాడలో లీటర్ పెట్రోల్ 109.31 పైసలుండగా, విశాఖలో 108.29 పైసలుగా ఉంది. డీజిల్ పై లీటర్ కు రూపాయి 82 పైసలు మాత్రమే తగ్గగా.. విశాఖలో మాత్రం 2రూపాయల 19 పైసలు తగ్గింది. లీటర్ డీజిల్ విజయవాడలో 97.17 పైసలు ఉండగా, విశాఖలో 96.17 పైసలుగా ఉంది. హైదరాబాద్ లో 2 రూపాయల 24 పైసల భారం తగ్గింది. వివిధ ప్రాంతాల్లో పావలా అటూ ఇటూగా ధర తగ్గింది. ఇక హైదరాబాద్ లో డీజిల్ ధర 2 రూపాయల 16 పైసలు తగ్గింది. కొన్ని ప్రాంతాల్లో 2 రూపాయల వరకు తగ్గింది. హైదరాబాద్ లో లీటర్ డీజిల్ ధర 95.65 పైసలుండగా, లీటర్ పెట్రోల్ ధర 107.41 పైసలుగా ఉంది.

ముడిచమురులో అస్థిరత ఎక్కువగా ఉన్నందున సమీప భవిష్యత్తులో ఇంధన ధరలను తగ్గించబోమని జనవరిలో కేంద్ర మంత్రి హర్దీప్ పూరి తెలిపారు. భారతదేశంలో ఇంధన సరఫరా స్థిరంగా ఉందని, ధరలు ప్రస్తుతం ఉన్నట్టుగానే ఉంటాయన్నారు. ప్రభుత్వం, అడుగులు కూడా గ్రీన్ ఎనర్జీ వైపు పయనించడం కొనసాగుతాయన్నారు. పెట్రోలు, డీజిల్ ధరల తగ్గించడం ద్వారా వినియోగదారుల వ్యయాన్ని తగ్గిస్తుందని చెప్పారు. దేశంలో డీజిల్‌తో నడిచే 58 లక్షలకు పైగా భారీ వాహనాలు, 6 కోట్ల కార్లు, 27 కోట్ల ద్విచక్ర వాహనాల నిర్వహణ ఖర్చులను తాజా తగ్గింపుతో లాభపడతాయని పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలిపింది.