Home Page SliderInternational

హాలీవుడ్‌లో RRR మూవీ దూకుడు-ఏకంగా ఐదు అవార్డులు కైవసం

Share with

RRR మూవీ మేనియా హాలీవుడ్‌ని షేక్ చేస్తోంది. ప్రముఖ హాలీవుడ్ సినిమాలను వెనక్కినెట్టి ఏకంగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో ఐదు అవార్డులు సొంతం చేసుకుంది. తెలుగు సినిమా గతంలో ఎన్నడూ లేనంతగా అంతర్జాతీయ వేదికలపై వెలిగిపోతోంది. ఒక వైపు పేరు ప్రఖ్యాతలు, మరోవైపు భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ నామినేషన్ లభించింది. సంగీత దర్శకుడు కీరవాణికి గ్లోబల్ గ్లోబ్ అవార్డును తెచ్చిపెట్టింది ఈ పాట.

శుక్రవారం రాత్రి జరిగిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియోషన్ అవార్డుల కార్యక్రమంలో RRR సినిమాకు ఐదు విభాగాలలో అవార్డులు వచ్చాయి. బెస్ట్ స్టంట్స్, బెస్ట్ యాక్షన్ మూవీ, బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్, స్పాట్ లైట్ అవార్డులు వరించాయి. ఈ అవార్డులను అక్కడే ఉన్న చిత్ర దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి అందుకున్నారు. అవార్డుల నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి వీరితో పాటు రామ్ చరణ్, కార్తికేయ కూడా హాజరయ్యారు. ఈ చిత్రాన్ని హాలీవుడ్‌లో రీ రిలీజ్ చేస్తున్నారు. దీనితో రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, కార్తికేయ అమెరికాలోనే ఉంటూ చిత్ర ప్రమోషన్లలో చురుకుగా పాల్గొంటున్నారు.