National

ఏడాది పూర్తిచేసుకున్న RRR మేనియా

Share with

ప్రపంచవ్యాప్తంగా RRR సినిమా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఓ పక్క కలెక్షన్లతో  బాక్సాఫీస్‌ను షేక్ చేస్తే ,మరోపక్క అంతర్జాతీయంగా ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులను సొంతం చేసుకుంది. అందులో ముఖ్యంగా సినిమా రంగంలోనే ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే  ఆస్కార్‌ను కైవసం చేసుకున్న తొలి తెలుగు సినిమాగా RRR రికార్డులకెక్కింది. రాజమౌళి దర్శకత్వం ,కీరవాణి సంగీతం,రామ్‌చరణ్-NTR నటన ఈ సినిమాను మరో రేంజ్‌లో నిలబెట్టాయి. అయితే RRR సినిమాలోని “నాటు-నాటు” పాట ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోనే ఉండగా..ఈ సినిమా విడుదలై నేటికి ఏడాది పూర్తయింది. గోల్డెన్ గ్లోబ్ ,క్రిటిక్ ఛాయిస్ వంటి ఎన్నో అంతర్జాతీయ అవార్డులను అందుకున్న ఈ మూవీ భారతీయ సినిమా ఖ్యాతిని అమాంతం పెంచేసింది.