Home Page SliderNational

“రోహిత్ కెప్టెన్సీ అద్భుతంగా ఉంది”:బుమ్రా

Share with

మరికాసేపట్లో ఇండియా vs  సౌతాఫ్రికా T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ బౌలర్  జస్‌ప్రీత్ బుమ్రా కెప్టెన్ రోహిత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రతి మ్యాచ్‌లో రోహిత్ ఉత్సాహం చూస్తుంటే ముచ్చటేస్తుందని తెలిపారు. కాగా రోహిత్ కెప్టెన్సీ అద్భుతంగా ఉందని బుమ్రా కొనియాడారు. అయితే ఓ ఆటగాడిగా రాణిస్తూ జట్టును నడిపించడం చిన్న విషయం కాదన్నారు. అయినప్పటికీ రోహిత్‌లో జోరు ఏమాత్రం తగ్గలేదన్నారు. కాగా రోహిత్ జట్టులో ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛనిస్తారని బుమ్రా వెల్లడించారు. హిట్ మ్యాన్ నాయకత్వంలో జట్టులో ప్రతి ఒక్కరి ఆత్మ విశ్వాసం అత్యుత్తమంగా ఉందని బుమ్రా స్పష్టం చేశారు.