Home Page SliderTelangana

నిమ్స్‌లో త్వరలో ప్రారంభం కానున్న రోబోటిక్ సర్జరీలు

Share with

తెలంగాణా ప్రభుత్వం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో అతి త్వరలోనే రోబోటిక్ సర్జరీలు ప్రారంభించనుంది. కాగా ఎల్లుండి నుంచే నిమ్స్ ఆసుపత్రిలో  ఈ రోబోటిక్ సర్జరీలు అందుబాటులోకి రానున్నాయి.అయితే ఎంతో వేగంగా,ఖచ్చితత్వంతో కూడిన సర్జరీలు చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం డావెన్సీ ఎక్స్‌ఐ రోబోను కొనుగోలు చేసింది. కాగా రూ31.5కోట్లతో దీన్ని కొనుగోలు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ రోబో ద్వారా ఎలాంటి కోత లేకుండానే కేవలం ఓ చిన్న రంధ్రంతో ఎంత పెద్ద శస్త్రచికిత్సనైనా సులభంగా చేయవచ్చు. అయితే ప్రస్తుతం దీనిని సర్జికల్ గ్యాస్ట్రో, అంకాలజీ, యూరాలజీ విభాగాల్లో ఉపయోగించనున్నారు. ఇవాళ తెలంగాణా ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఈ రోబోటిక్ సర్జరీ యంత్రాన్ని ప్రారంభించనున్నారు.