Home Page SliderTelangana

జీవో నెం.111 రద్దుపై రేవంత్ రెడ్డి సంచలన వాఖ్యలు

Share with

తెలంగాణాలో ఇటీవల కాలంలో రాష్ట్రంలో ఇప్పటివరకు అమలు చేసిన జీవో నెం.111 ను రద్దు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో తెలంగాణా వ్యాప్తంగా ఉన్న ప్రజలు దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలంగాణాలోని ప్రతిపక్షాలు మాత్రం దీనిపై మండిపడుతున్నాయి. తాజాగా టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి దీనిపై స్పందించారు.తెలంగాణాలో జీవో నెం.111రద్దుతో జంట నగరాల్లో విధ్వంసం జరుగుతోందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో జీవో నెం.111 ఎత్తివేతపై రూ.లక్షల కోట్లలో కుంభకోణం జరుగుతుందని విమర్శించారు. కాగా దీనిపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీని వేయనున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. దీంతో ఎవరెవరు ఎక్కడెక్కడ ఎన్ని భూములు కొన్నారో తేల్చుతామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణా మంత్రి కేటీఆర్ తన స్నేహితులకు రూ.వేల కోట్లు కట్టబెట్టేందుకే ఈ జీవో నెం.111 రద్దు చేశారని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కాగా గతంలో హైదరాబాద్ జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్,హిమాయత్ సాగర్ పరిధిలోని భూముల్లో కట్టడాలను ప్రభుత్వం నిషేదిస్తూ..జీవో నెం.111 ను జారీ చేసింది. అయితే తాజాగా ఆ ప్రాంతంలో నగరీకరణ కోసం ఆ జీవోను రద్దు చేస్తున్నట్లు తెలంగాణా ప్రభుత్వం వెల్లడించింది.