Home Page SliderTelangana

జూపల్లిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి

Share with

జూపల్లి కృష్ణారావు  నివాసానికి కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి, గుర్నాథ్ రెడ్డి, రేవంత్ రెడ్డి వెళ్లి కాంగ్రెస్‌లో చేరాలంటూ ఆయనను కోరారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించిన జూపల్లి, పొంగులేటి వంటివారు కాంగ్రెస్ పార్టీలో చేరాలని, కేసీఆర్ రాజకీయాలకు వ్యతిరేకంగా పునరేకీకరణ కావాలని రేవంత్ పేర్కొన్నారు. కేసీఆర్‌పై తిరుగుబాటు చేయాలని, ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని రేవంత్ పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తెలంగాణా కాంగ్రెస్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అనంతరం ఖమ్మంలోని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసానికి కూడా కాంగ్రెస్ నాయకులందరూ వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోసం పాటు పడిన జూపల్లిని తెలంగాణా ఇచ్చిన కాంగ్రెస్‌లోకి ఆహ్వానించడం చాలా సంతోషమని, ఆయన రాకతో తెలంగాణా కాంగ్రెస్ బలపడుతుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పెద్దలు తన ఇంటికి రావడం, తనను ఆహ్వానించడం చాలా సంతోషమని, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. కేసీఆర్ నియంతృత్వ పాలన చేస్తున్నారని, అవినీతిలో తెలంగాణా చాలా అభివృద్ధి చెందిందని అందుకే బీఆర్‌ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చానన్నారు. పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయలేదన్నారు. అందుకే ఈ ప్రభుత్వాన్ని నాలుగేళ్ల క్రితమే వ్యతిరేకించానని వ్యాఖ్యానించారు.