Home Page SliderTelangana

కొడంగల్‌లో రూ. 4,300 కోట్ల అభివృద్ధి పనులకు రేవంత్ శంకుస్థాపన

Share with

కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో, స్విచ్ ఆన్ చేసి ఒకేసారి పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రూ.4,369.143 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

రూ.2,945 కోట్లతో నారాయణపేట్ – కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి శంకుస్థాపన

రూ.6.8 కోట్ల అంచనా వ్యయంతో కొడంగల్‌లో ఆర్ అండ్ బి అతిధి గృహ నిర్మాణానికి శంకుస్థాపన

రూ.344.5 కోట్ల అంచనా వ్యయంతో కొడంగల్ నియోజకవర్గ వ్యాప్తంగా సింగిల్ లేన్ నుండి డబుల్ లేన్ రోడ్లు, వాటి విస్తరణ, పలు బ్రిడ్జిల నిర్మాణాలకు శంకుస్థాపన

రూ.27.886 కోట్లతో వికారాబాద్ జిల్లాలో బిటి రోడ్డు సదుపాయం లేని మారుమూల గిరిజన ప్రాంతాలకు రోడ్లు వేసేందుకు శంకుస్థాపన.

రూ.5 కోట్లతో గిరిజన సంక్షేమ హాస్టల్ భవనానికి భూమి పూజ

రూ.25 కోట్లతో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ శాశ్వత భవనానికి శంకుస్థాపన

రూ.40 కోట్లతో సి.సి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన

రూ.7.13 కోట్లతో దౌల్తాబాద్ జూనియర్ కాలేజికి శంకుస్థాపన

రూ.7.13 కోట్లతో బొమ్రాస్పేట్ జూనియర్ కాలేజికి శంకుస్థాపన

రూ.25 కోట్లతో నీటుర్ గ్రామం, దౌల్తాబాద్ మండలం మహాత్మా జ్యోతిరావు పూలే బిసీ రెసిడెన్షియల్ స్కూల్/కాలేజికి శంకుస్థాపన

రూ.360 కోట్లతో చంద్రకల్ గ్రామం,దౌల్తాబాద్ మండలంలో నూతన వెటర్నరీ కాలేజి నిర్మాణానికి శంకుస్థాపన

రూ.30 కోట్లతో కోస్గి మండల కేంద్రంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలకు శంకుస్థాపన

రూ.11 కోట్లతో కోస్గి మండల కేంద్రంలో మహిళా డిగ్రీ కళాశాలకు శంకుస్థాపన

రూ.20 కోట్లతో మద్దూర్ మండల కేంద్రంలో బాలికల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్/జూనియర్ కాలేజికి శంకుస్థాపన

రూ.25 కోట్లతో కొడంగల్ మండల కేంద్రంలో బాలుర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్/జూనియర్ కాలేజి శంకుస్థాపన

రూ.224.50 కోట్లతో మెడికల్ కాలేజీ,నర్సింగ్ కాలేజి, ఫిజియోథెరపీ కాలేజి,220 పడకల హాస్పిటల్ కు శంకుస్థాపన

రూ.213.2070 కోట్లతో కొడంగల్ నియోజకవర్గంలో హెచ్ఎల్బిఎస్ మరియు R/Fs అప్రోచ్ రోడ్ పనులకు శంకుస్థాపన

రూ.3.99 కోట్లతో దుద్యాల్ మండలంలోనీ హస్నాబాద్ గ్రామ నూతన 33/11 కెవి సబ్ స్టేషన్ కు శంకుస్థాపన