Home Page SliderTelangana

అప్పులకుప్పగా తెలంగాణ..శ్వేతపత్రం విడుదల చేసిన రేవంత్ ప్రభుత్వం

Share with

తెలంగాణ రాష్ట్రం బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పులకుప్పగా మారిందని వ్యాఖ్యానించారు ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై నేటి అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసింది.

 శ్వేతపత్రంలోని ముఖ్యాంశాలు.

తెలంగాణ మొత్తం అప్పులు   – రూ.6,71,757 కోట్లు

2014-15 నాటికి అప్పు       -రూ. 72,658 కోట్లు

2014-2015 నుండి 2022-23 మధ్య సగటున 24.5 శాతం పెరిగిన అప్పులు.

2023-2024 అంచనాల ప్రకారం రాష్ట్ర రుణం – రూ. 3,89,673 కోట్లు.

2015-16 లో తెలంగాణ రుణ, జీఎస్టీపీ 15.7 శాతం. ఇది దేశంలోనే తక్కువగా నమోదయ్యింది.