Home Page SliderTelangana

రిటైర్డ్ అధికారులు.. ఇక ఇంటికే!

Share with

హైదరాబాద్: గ్రేటర్ కీలక విభాగాల్లో తిష్టవేసిన కొందరు రిటైర్డ్ ఉద్యోగులను తప్పించే సూచనలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే రిటైర్ అయినా గతంలో ఉన్నతాధికారుల అండతో ఇంకా విధుల్లో కంటిన్యూ అవుతున్న పలువురిని ఇంటికే పరిమితమయ్యేలా చర్యలు తీసుకునేటట్లు కనబడుతోంది. ఇలాంటి అధికారులపై కింది స్థాయి నుండి పలు కంప్లైంట్లు కూడా వచ్చాయి. అయితే పై స్థాయిలో ఉన్న అధికారుల చలవతో అధికారం చెలాయిస్తూ కంటిన్యూ అవుతున్నారు. దీంతో తమకు అవకాశాలు రావడం లేదని కింది స్థాయి అధికారులు పలుమార్లు వాపోయారు. ప్రభుత్వం మారడంతో ఇక ఇలాంటి రిటైర్డ్ ఉద్యోగులు ఇంటిముఖం పట్టనున్నారు.