Home Page SliderInternational

మొసళ్లలో తప్పిపోయిన ఆస్ట్రేలియన్ వ్యక్తి అవశేషాలు

Share with

చేపల వేటకు వెళ్లి తప్పిపోయిన ఆస్ట్రేలియన్ వ్యక్తి అవశేషాలు రెండు మొసళ్లలో అధికారులు గుర్తించారు. కెవిన్ డర్మోడీ అని 65 ఏళ్ల వ్యక్తి ఉత్తర క్వీన్స్‌లాండ్‌లో మిత్రులతో కలిసి చేపలు పట్టడానికి వెళ్లాడు. చేపలు పట్టడం ప్రారంభించేందుకు మొసలిని తరిమికొట్టారు. ఆ సమయంలో ఆ వ్యక్తి, భీకరంగా అరవడాన్ని సమీప ప్రజలు గుర్తించారు. అయితే ఆ తర్వాత ఆ వ్యక్తి కన్పించకుండా మాయమైపోయాడు. ఎంత వెదికినా కన్పించలేదు.

దీంతో వ్యక్తి కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. ఆ వ్యక్తిని మొసళ్లు తిన్నాయని గ్రహించిన పోలీసులు, వాటిని కాల్చి చంపడానికి రైఫిల్‌లను ఉపయోగించారు. ఒక మొసలి సుమారు 4.2 మీటర్లు, మరోటి 2.8 మీటర్లు ఉందని పోలీసులు తెలిపారు. లేక్‌ఫీల్డ్ నేషనల్ పార్క్‌లో చేపలు పడుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. రెండు ముసళ్లలో మానవ అవశేషాలు కనిపించాయని పోలీసులు తెలిపారు. ఇదో విషాదకరమైన, ముగింపుగా పోలీసులు తేల్చారు.

130 మంది జనాభా ఉన్న గ్రామీణ ఉత్తర క్వీన్స్‌లాండ్ పట్టణం లారాకు చెందిన వ్యక్తి, ఆ ప్రాంతంలో మంచి పలుకుబడి ఉందని.. ఇలా ముసలి చేతిలో ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆవేదన వ్యక్తమయ్యింది. ఇలాంటి ఘటన నేపథ్యంలో చేపల వేటకు వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని క్వీన్స్‌లాండ్ అధికారులు విజ్ఞప్తి చేశారు. లేక్ ఫీల్డ్‌లో చేపల వేటకు రాకుండా ఉంటే మంచిదని స్థానికులను పోలీసులు హెచ్చరించారు. మొసళ్ల సంరక్షణ కోసం ప్రత్యేకంగా ప్రకటించిన సరస్సులకు రావొద్దని హితవు పలికారు.