Home Page SliderNational

డెలివరీ రంగంలో ప్రవేశించనున్న రిలయన్స్

Share with

క్విక్ కామర్స్ రంగంలోకి వ్యాపార దిగ్గజం రిలయన్స్ కూడా ప్రవేశించింది. వేగంగా డెలివరీలు చేసే స్విగ్గీ, జెప్టో,బ్లింకిట్ తరహాలో రిలయన్స్ కూడా సరుకుల రవాణాను వినియోగదారులకు అందించే డెలివరీ రంగంలో అడుగుపెట్టడానికి సిద్ధమయ్యింది. ఇప్పటికే ముంబయి, నవీ ముంబయిలో కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాలలో ఈ సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. దీనిని హైపర్ లోకల్ డెలివరీ అనే పేరుతో జియోమార్ట్ యాప్‌కు అనుసంధానించారు. కొన్ని రోజులపాటు గంటలోపే డెలివరీ చేస్తామని, వీలైనంత తొందరలో ఈ సమయాన్ని అరగంటకు తగ్గిస్తామని అధికారులు హామీ ఇస్తున్నారు. మార్కెట్లు ఎక్కువైన కొద్దీ దీనిని విస్తరిస్తామని తెలియజేశారు. ఇప్పటికే జియోమార్ట్‌లో సరుకులను అందజేస్తున్నా, ఆర్డర్ చేసిన రోజే డెలివరీని మాత్రం అందించలేదు. జియోమార్ట్ పార్టనర్‌లో భాగంగా 20 లక్షల కిరాణా దుకాణాలను రిలయన్స్ రిటైల్ హోల్‌సేల్ విభాగం నుండి కొనుగోలు చేస్తున్నాయి. తొలుత నిత్యావసర సరుకులతో ప్రారంభించి, దీనిని దుస్తులు, ఎలక్ట్రానిక్స్‌కు కూడా విస్తరింపజేయాలని ఆలోచిస్తున్నారు. బెంగళూరు, ఢిల్లీ , ముంబయ్, చెన్నై, హైదరాబాద్, పుణె, కోల్‌కతా నగరాలలో కూడా ఈ వేగవంతమైన సేవలు అందుబాటులోకి రానున్నాయి.