Home Page SliderTelangana

ఆస్తుల వివరాలతో బీఆర్‌ఎస్ డాక్యుమెంట్ విడుదల..శ్వేతపత్రాన్ని తిప్పికొట్టిన బీఅర్‌ఎస్

Share with

గత పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వ అప్పుల వివరాలతో నేటి అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిని తిప్పికొట్టే ఉద్దేశంతో బీఆర్‌ఎస్ పార్టీ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని, పెరిగిన ఆస్తుల వివరాలతో ఓ డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. తెలంగాణ ఆస్తులు ఎన్నోరెట్లు పెరిగాయంటూ కేసీఆర్ హయంలో సృష్టించిన ఆస్తుల జాబితాను అందులో పొందుపరిచింది. ప్రభుత్వ శ్వేతపత్రం కంటే ముందే దీనిని బీఆర్‌ఎస్  విడుదల చేయడం విశేషం. దీనితో బీఆర్‌ఎస్ వ్యూహం కనిపిస్తోందని రాజకీయవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు.