Home Page SliderNews

ద్వేషపూరిత ప్రసంగాలపై కేసులు నమోదు చేయండి, రాష్ట్రాలకు సుప్రీం ఆదేశాలు

Share with

రాష్ట్రాలకు సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
ద్వేషపూరిత ప్రసంగాలు చేసేవారిపై ఉక్కుపాదం
ఆ ప్రసంగాలు లౌకిక స్వరూపానికి ముప్పు
కేసు నమోదు చేయకుంటే కోర్టు ధిక్కారమే!

ఎటువంటి ఫిర్యాదు చేయకపోయినా ద్వేషపూరిత ప్రసంగాలపై కేసులు నమోదు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశిస్తూ 2022 నాటి ఉత్తర్వుల పరిధిని సుప్రీంకోర్టు ఈరోజు పొడిగించింది. అక్టోబర్ 2022 ఆర్డర్, ద్వేషపూరిత ప్రసంగాల కేసులను సుమోటోగా తీసుకోవాలని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ పోలీసులను ఆదేశించింది. అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల సైతం ఆదేశాన్ని పాటించాలని తేల్చి చెప్పింది. కేసులు దాఖలు చేయడంలో జాప్యం చేస్తే కోర్టు ధిక్కారంగా పరిగణించబడుతుందని హెచ్చరించింది. ద్వేషపూరిత ప్రసంగాలు తీవ్రమైన నేరంగా పేర్కొంటూ అత్యున్నత న్యాయస్థానం, ఇవి దేశంలోని లౌకిక స్వరూపాన్ని ప్రభావితం చేయగలవని అభిప్రాయపడింది.

ఏ అధికారిక ఫిర్యాదు కోసం ఎదురుచూడకుండా, ద్వేషపూరిత ప్రసంగాలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి అన్ని రాష్ట్రాలు/యుటిలు సుమోటోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అక్టోబరు 21, 2022న ఆమోదించబడిన ప్రారంభ ఆర్డర్ ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలకు మాత్రమే వర్తిస్తుంది. ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన సదరు వ్యక్తి మతంతో సంబంధం లేకుండా చర్యలు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంది.