NewsTelangana

అసలు సిసలు వార్తలు

Share with

వార్త వేరు… విశ్లేషణ వేరు… సమాచారం వేరు… కల్పితం వేరు… వర్షన్ ఒకటైతే… చెప్పేది మరోటి… ఇలా వార్త మాధ్యమాల్లో ఎంతో కన్ఫ్యూజన్. తెలుగు నేలపై ఎన్నో మీడియాలు ప్రజల మనస్సుల్లో స్థానం సంపాదించుకున్నాయ్. మరికొన్ని దోషిగా నిలబడ్డాయ్. ఎన్ని మీడియాలు వచ్చినా ప్రజలకు అసలు నిజం అందడం లేదన్న భావన చాన్నాళ్ల నుంచి మన సమాజంలో ఉంది. ఇలాంటి తరుణంలో నిజం, నిజాయితీ, నిబద్ధత ఈ మూడు సూత్రాల ఆధారంగా ఒక వార్తా స్రవంతిని మీ ముందుకు తేవాలని ప్రయత్నిస్తున్నాం. ప్రజలంటే కేవలం ఓట్లేసే బానిసలని… రెండు పచ్చ నోట్లిస్తే చాలు… ఓటు గుద్దేస్తారనుకుంటున్న పార్టీలకు చెంపచెల్లుమనిపించేలా జన జాగృతి చేసేందుకు మీ ముందుకు వస్తున్నాం. కేవలం వార్తలు మాత్రమే కాదు.. ప్రజలకు కావాల్సిన ఎన్నో అంశాలపై విశ్లేషణలు… స్ఫూర్తి గాథలను మీ ముందుకు తీసుకొస్తాం. నిజాయితీ అస్త్రంగా… ప్రజల ఆకాంక్షలే ఎజెండాగా… గతంలో ఎన్నడూ లేని విధంగా వాస్తవాలను ప్రజా కోణంలో ఆవిష్కరించేందుకు వస్తోంది మనసర్కార్. భారతదేశ సమగ్ర స్ఫూర్తి… తెలుగు జాతి ఘన కీర్తిని చాటేందుకు… నిఖార్సయిన వార్తలను… ఎప్పటికప్పుడు అందిస్తోంది “మనసర్కార్”.