Home Page SliderNational

ఇవాల్టి నుంచి ఆకాశంలో అద్భుతాలను చూడటానికి సిద్ధమా

Share with

నేటి నుంచి మరో 5 రోజులపాటు ఆకాశంలో అద్భుత దృశ్యాలు ఆవిష్కృతం కానున్నాయి. కాగా ఇవాళ రాత్రి  ఆకాశం నుంచి ఉల్కాపాతాలు భూమిపైకి రాలనున్నాయి. అయితే ఈ ఉల్కాపాతాలను ప్రజలంతా నేరుగా చూడొచ్చని ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ సంచాలకులు శ్రీ రఘునందన్ తెలిపారు.  ఈ మేరకు ఈ రోజు నుండి డిసెంబర్ 20 వరకు ప్రతిరోజు రాత్రి 9 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు వేర్వేరు సమయాల్లో ఉల్కాపాతాలు కన్పిస్తాయని ఆయన పేర్కొన్నారు. కాగా పాథియాన్ అనే గ్రహశకలం సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో కొద్ది నెలల క్రితం భూకక్ష్యలోకి ప్రవేశించిందన్నారు. అయితే ఇది కొన్ని పదార్థాలతో కలిసి రాపిడికి గురై చిన్న చిన్న ఉల్కలుగా రాలిపడబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇవి గంటకు ఏకంగా 150 కాంతి పుంజాలను వెదజల్లుతాయని అంతర్జాతీయ ఉల్కాపాత సంస్థ(IMO) తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలతోపాటు,పట్టణ ప్రాంతాలలో కూడా ఇవి ప్రకాశవంతగా కన్పిస్తాయని తెలిపింది. ఆ  సమయంలో వాటిని చూసిన వారు ఫోటోలు,వీడియోలు తీసి అంతర్జాతీయ ఉల్కాపాత సంస్థ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించింది.