Home Page SliderNational

భారత్‌లో త్వరలో పరుగులు పెట్టనున్న ర్యాపిడ్ రైలు

Share with

భారతదేశంలో మొట్టమొదటి ర్యాపిడ్ రైలును త్వరలోనే ప్రారంభించబోతున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఇది ప్రారంభం కాబోతోంది. ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా 17 కిలోమీటర్ల కారిడార్ వచ్చేవారమే ప్రారంభం అవుతుంది. ఈ రైలుకు RAPID X అని పేరు పెట్టారు. దీనిని పూర్తి స్థాయిలో తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. 2025 నాటికి ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ మార్గంలో ఈ రైలు తిరగబోతోంది. దీనిని నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) రూపొందిస్తోంది. 82 కిలోమీటర్ల ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ మార్గంలో దీనిని నడపాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.30,274 కోట్లు. ADB BANK, AIIB, NDB బ్యాంకుల ఫైనాన్స్‌తో ఈ ప్రాజెక్టును మొదలు పెట్టనున్నారు. ఈ ట్రైన్లలో మహిళల కోసం ప్రత్యేక కోచ్‌లను ఏర్పాటు చేయనున్నారు. గరిష్టంగా గంటకు 160 కిలోమీటర్ల వేగం అందుకునేలా దీనిని డిజైన్ చేశారు. ఇది ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన జాయింట్ వెంచర్‌గా పని చేస్తుంది.