NewsTelangana

“అధికారి”గా రాబోతున్న రామ్‌చరణ్

Share with

రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ రూపొందుతోంది. ఇప్పటికే RC15 టైటిల్‌తో వర్కింగ్ స్టార్ట్ చేసిన ఈ సినిమాని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. రాజకీయ నేపథ్యమున్న యాక్షన్ కథానంశంతో రూపొందుతున్న చిత్రమిది. కాగా ఇందులో చరణ్ IAS ఆఫీసర్‌గా కనిపించనున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీకి ‘అధికారి’ అనే పేరు ఖారారు చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఈ మూవీలోని చరణ్ లుక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో చరణ్ బ్లాక్ సూట్ వేసుకొని ఫైల్ పట్టుకొని కనిపించగా , అతని పక్కనే  హీరోయిన్ కియారా అద్వానీ , డైరెక్టర్ శంకర్.. ఇంకా కొంతమంది వ్యక్తులు అతనిని ఫాలో అవుతున్నట్టు ఉంటుంది.