Home Page SliderNational

‘రైట్ టు హెల్త్’ బిల్లుపై ఆందోళన విరమించిన రాజస్థాన్ డాక్టర్స్

Share with

రెండువారాల సమ్మె అనంతరం రాజస్థాన్ డాక్టర్లు రైటు టు హెల్త్ బిల్లుపై సమ్మెను విరమించారు. ప్రైవేట్ ఆసుపత్రులలో కూడా ఉచితంగా అత్యవసర పరిస్థితుల్లో పేషెంట్లను చేర్చుకోవాలన్నదే ఈ రైటు టు హెల్త్ బిల్లు. దీనిపై ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లులో కొన్ని మార్పులు చేయగా ఎట్టకేలకు వైద్యులు దీనిని అంగీకరించారు. దీనిపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ మాట్లాడుతూ తనకు ఈ బిల్లు పాసవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రోగులు-వైద్యుల సంబంధం బలపడుతుందని ఆశిస్తున్నానన్నారు. రైట్ టు హెల్త్ బిల్లు తీసుకువచ్చిన మొదటి రాష్ట్రంగా రాజస్థాన్ నిలిచిందన్నారు.

ఇండియన్ మెడికల్ అసోషియేషన్, ప్రైవేట్ హాస్పటల్స్, నర్సింగ్ హోమ్స్ సొసైటీ కలిసి రాష్ట్రప్రభుత్వంతో 8 పాయింట్ల అగ్రిమెంట్ చేసుకున్నారు. దీనికి అంగీకరించి సమ్మె విరమించారు వైద్యులు. ఈ అగ్రిమెంట్ ప్రకారం 50 పడకల కన్నా తక్కవ సౌకర్యం ఉన్న హాస్పటల్స్‌కి ఈ బిల్లు వర్తించదు. ఇంకా ప్రభుత్వ గ్రాంట్లను పొందని ఆసుపత్రులకు కూడా ఇది వర్తించదు.