Home Page SliderNational

లోక్‌సభలో రాహుల్ vs అమిత్ షా

Share with

ఈ రోజు ప్రారంభమైన లోక్‌సభ సమావేశాలు వాడీ వేడీగా కొనసాగుతున్నాయి. కాగా ఇవాళ లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ..గొప్ప నేతలంతా అహింస గురించి మాట్లాడారన్నారు. కానీ ఇప్పుడు హిందువులని చెప్పుకునేవాళ్లు హింస, ద్వేషం, అబద్ధాలు మాట్లాడుతున్నారని రాహుల్ మండిపడ్డారు. కాగా దీనిపై అమిత్ షా అభ్యంతరం వ్యక్తం చేశారు. అమిత్ షా మాట్లాడుతూ.. హింసను ధర్మంతో జోడించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ హిందు భావన తెచ్చినందుకు క్షమాపణలు చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేసారు. దీంతో లోక్‌సభ సమావేశాలు మరింత హీటెక్కాయి.