Home Page SliderNational

రాహుల్ గాంధీ అమెరికా పర్యటన షురూ

Share with

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమెరికా పర్యటనకి ముహుర్తం ఖరారైంది. కాగాి రాహుల్ గాంధీ మే 31 వ తేదిన అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఓ  10 రోజుల పాటు అమెరికాలోనే బస చేయనున్నట్లు సమాచారం. అంతేకాకుండా జూన్ 4న న్యూయార్క్‌లోని మాడిసన్ స్వ్కేర్ గార్డెన్‌లో 4 వేలమంది NRI లతో కలిసి ర్యాలీ చేయనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అనంతరం ఆయన వాషింగ్టన్ ,కాలిఫోర్నియాలో పర్యటించనున్నారు. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది. కాగా USA లోని పలువురు రాజకీయ నేతలు,పారిశ్రామిక వేత్తలను కూడా కలుస్తారని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడానికి రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ అమెరికా పర్యటన ప్రాధాన్యం సంతరించుకంది.