Home Page SliderInternational

అమెరికాలో రాహుల్ గాంధీ ట్రక్ ప్రయాణం- డ్రైవర్ జీతమెంతో తెలుసా?

Share with

రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ ప్రయాణంలో సరదాగా ట్రక్ ఎక్కారు రాహుల్ గాంధీ. అమెరికాలోని ట్రక్ డ్రైవర్ల పరిస్థితి చాలా బాగుందన్నారు రాహుల్ గాంధీ. అక్కడ తేజేందర్ సింగ్ అనే భారతీయ అమెరికన్‌ ట్రక్ డ్రైవర్‌తో కలిసి వాషింగ్టన్ నుండి న్యూయార్క్ వరకు ట్రక్ ప్రయాణం చేశారు. వారి జీతం నెలకు 10 వేల డాలర్లు ఉంటుందని అంటే రూపాయలలో  8 లక్షల వరకూ ఉంటుందని తెలిసి, ఆశ్చర్యపోయారు రాహుల్. భారత్‌లో లారీ డ్రైవర్ల పరిస్థితి కత్తి మీద సాము లాంటిందని, కష్టాలతో, నిరంతర ప్రయాణాలతో కూడుకుని ఉంటుందని వ్యాఖ్యానించారు. గతంలో ఇండియాలో కూడా ఢిల్లీ నుండి ఛండీగడ్ వరకూ లారీలో ప్రయాణం చేశారు రాహుల్. వారి పరిస్థితులను స్వయంగా గమనిస్తున్నారు కాంగ్రెస్ నేత. ఈ సంగతి తెలిసిన నెటిజన్లు భారత్‌లో పరిస్థితులతో పోల్చి చూస్తున్నారు.