Home Page SliderTelangana

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఖాయం రాహుల్ గాంధీ

Share with

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ కచ్చితంగా గెలుస్తోందని, బహుశా తెలంగాణలో గెలుస్తుందని, రాజస్థాన్‌లో గట్టి పోటీ ఉందని అన్నారు. లోక్‌సభలో బీఎస్పీ నేత డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరి చేసిన అవమానకరమైన వ్యాఖ్యలపై కూడా గాంధీ ప్రస్తావిస్తూ, కుల గణన డిమాండ్ నుంచి దృష్టి మరల్చేందుకు బీజేపీ ఇటువంటి వ్యూహాలకు పాల్పడుతోందని ఆరోపించారు. విపక్షాలు కలిసికట్టుగా పని చేస్తున్నాయని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఆశ్చర్యానికి గురయ్యేలా ప్రజా తీర్పు ఉంటుందని రాహుల్ అన్నారు.