Home Page SliderNational

రాహుల్ గాంధీ ఓ రియల్ లైఫ్ దేవదాస్: బీజేపీ

Share with

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ దేశంలోని జాతీయ పార్టీలు విమర్శ -ప్రతి విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ,కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయిలో జరుగుతుంది. దీనిలో భాగంగానే బీజేపీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఓ రేంజ్‌లో మండిపడింది. కాగా ఈ రోజు రాహుల్ గాంధీ దేశంలోని బీజేపీ విపక్ష పార్టీల నేతలతో బీహర్‌లోని పాట్నాలో సమావేశం నిర్వహించారు. దీంతో బీజేపీ,కాంగ్రెస్‌ నేతల మధ్య విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాహుల్ గాంధీ విపక్షాల సమావేశానికి ముందు పాట్నాలోని బీజేపీ కార్యాలయం ఎదుట బీజేపీ కార్యకర్తలు రాహుల్ గాంధీపై ఓ ఫ్లేక్సీని ఏర్పాటు చేశారు. కాగా  సినిమాల్లో దేవదాస్ షారుఖ్ ఖాన్ అయితే..రియల్ లైఫ్ దేవదాస్ రాహుల్ గాంధీ అని ఫ్లేక్సీలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ విపక్షాల సమావేశంలో పాల్గొన్న పలు పార్టీల నాయకుల గురించి ఫ్లేక్సీలో ప్రస్తావించారు. మమతా బెనర్జీ బెంగాల్‌ను ,కేజ్రివాల్ ఢిల్లీ,పంజాబ్‌ను వీడాలన్నారు. లాలు,నితీశ్ కుమార్ బీహర్‌ను,అఖిలేష్ యాదవ్ ఉత్తర్ ప్రదేశ్‌ను,స్టాలిన్ తమిళనాడు,రాహుల్ గాంధీ రాజకీయాలను వీడాలని అందరూ కాంగ్రెస్‌ను అడిగే రోజు ఎంత దూరంలో లేదని ఫ్లేక్సీలో రాశారు. దీంతో ఈ ఫ్లేక్సీ కాస్త వివాదాస్పదమైంది.