Andhra PradeshHome Page Slider

మేకర్స్‌కు తలనెప్పిగా మారిన పుష్ప-2 వీడియో లీక్

Share with

పుష్ప ది రూల్ (2) చిత్ర షూటింగ్ శరవేగంగా సాగిపోతోంది. అయితే ఈ మూవీ మేకర్స్‌ను లీకుల బెడద వెంటాడుతోంది. మారేడుమిల్లిలో జరుగుతున్న పుష్ప 2 షూటింగ్‌లో నిముషానికి పైగానే ఉన్న వీడియో లీకయ్యింది. దీనితో కంగారు పడుతున్నారు మైత్రి మూవీస్. ఎర్ర చందనపు దుంగల లారీలు నది నీటిలో వెళుతున్న వీడియో సోషల్ మీడియోలో వైరల్ కావడంతో ఏం చెయ్యాలో దిక్కు తోచట్లేదు. గతంలో పుష్ప ది రైజ్ చిత్రానికి కూడా లీకు తప్పలేదు. దాక్కో దాక్కో మేక అనే పాట కొంతమేరకు లీకయ్యింది. భారీ బడ్జెట్ సినిమాలను ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ లీకుల బారిన పడకుండా కాపాడడం చాలా కష్టమవుతోంది దర్శక నిర్మాతలకు. సెట్స్‌లో ఫొటోలు, చిన్న చిన్న వీడియోలు బయటపడుతున్నాయి. ఈ లీక్స్ వల్ల చిత్రానికి హైప్ పెరిగినా, ముప్పు కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. అందుకే షూటింగ్‌ సమయంలో చాలా జాగ్రత్తలు పడుతుంటారు.